1) ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.
2) ఆరోగ్యమే మహాభాగ్యము.
3) ఆస్తి మూరెడు ఆశ బారెడు.
4) ఆవలింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట .
5) ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు.
6) ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?
7) ఆయనే వుంటే తెల్ల చీర ఎందుకు?
8) అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి.
9) అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చిగాడికి ఒక జంజపు పోగు.
10) అడగనిదే అమ్మ అయినా పెట్టదు.
11) అడకత్తెరలో పోకచెక్క లాగ
12) ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.
13) ఆడవారి నోట్లో ఆవగింజ అయినా దాగదు
14) అడవి కాచిన వెన్నెలలా..
15) అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు.
16) అద్దాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు.
17) అద్దం అబద్ధం చెప్పదు.
18) అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.
19) అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు.
20) అడుక్కున్నమ్మ కు అరవై కూరలు, వండుకున్న అమ్మకు ఒకటే కూర.
21) అడుసు తొక్కనేల, కాలు కడగనేల.
22) ఏ ఎండకు ఆ గొడుగు.
23) ఏమి లేని ఎడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము.
24) అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంటము.
25) అగ్నికి ఆజ్యం పోసినట్లు.
26) అగ్నికి వాయువు తోడైనట్లు.
27) ఐశ్వర్యము వస్తే అర్థ రాత్రి గొడుగు పట్టమనేవాడు.
28) అక్క పెళ్లి కుక్క చావుకి వచ్చింది.
29) ఆకులు నాక్కునే వాడి దగ్గర మూతులు నాక్కునే వాడట.
30) అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవలకి వెళ్లి నోట్లో వేసుకున్నాడట.
31) అంబలి నాకేటోడికి మీసాలేట్టే టోడు ఒకడు .
32) అంభంలో కుంభంలా.
33) అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది.
34) అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదు .
35) అమ్మబోతే అడివి కొనబోతే కొరివి.
36) అందని ద్రాక్ష పళ్ళు పుల్లన.
37) అందం అన్నం పెట్టదు.
38) అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట. (అందని మామిడి పళ్లకు చేతులు చాచుట)
39) అంధుని ముందు అందాలేల?
40) అందితే సిగ అంధక పోతే కాళ్ళు.
41) అన్న దానం కంటే విద్య దానం గొప్పది.
42) అన్నం పరబ్రహ్మ స్వరూపం.
43) అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి.
44) అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.
45) అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమనిగి ఉందట, ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడ్డదట.
46) అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చింది.
47) అంతటా బావే కానీ, వంగ తోట కాడ కాదు.
48) అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు.
49) అనుమానం పెనుభూతం.
50) అప్పిచ్చువాడు వైధ్యుడు.
51) అప్పు చేసి పప్పు కూడు.
52) అర్ధరాత్రి మద్దెల దరువు.
53) అసలు బాబు కన్నా, గుడ్డి బాబు మేలు.
54) అసలు కంటే వడ్డీ అంటే ప్రీతి.
55) అసలుకే ఎసరు పెట్టినట్లు.
56) అసమర్దుడికి అవకాశం ఇవ్వనేల?
57) ఆశపోతు బ్రాహ్మడు లేచి పోతూ పప్పు అడిగాడట.
58) అతి రహస్యం బట్ట బయలు.
59) అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు.
60) అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.
61) అత్త సొమ్ము అల్లుడు దానం.
62) ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతమంత నిజం కూడా నిలబడదు.
63) అయిన వారికి అరిటాకుల్లో,కాని వారికి కంచాలలో.
64) అయితే ఆదివారము, కాకుంటే సోమవారము.
65) అయ్య వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా?
66) అయ్యగారి పిల్లలతో ఆడుకున్నాదెబ్బలే, ఆడకున్నాదెబ్బలే.
67) అయ్యకి లేక అడుక్కు తింటుంటే, కొడుకు వచ్చి కోడి పలావు అడిగాడట.
68) అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు.
69) బావిలో కప్పలా..
70) బంతిలో బాలపక్షం.
71) బతకలేని వాడు బడి పంతులట.
72) బతికుంటే బలుసాకు తినోచ్చు.
73) బయం లేని కోడిపిట్ట బజార్లో గుడ్డు పెట్టిందట.
74) బెల్లం చుట్టూ ఈగలా ..
75) బెల్లం కొట్టిన రాయిలా..
76) భరించు వాడు భర్త.
77) బిడ్డోచ్చిన వేల, గోడ్డోచ్చిన వేల.
78) బోడి ముండకి మంగళ హారతి ఒకటి.
79) బూడిదలో పోసిన పన్నీరు.
80) చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు.
81) చాప కింద నీరులా...
82) చావు కబురు చల్లగా చెప్పినట్టు..
83) చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు.
84) చచ్చినవాని కండ్లు చారెడు.
85) సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం.
86) చదవేస్తే ఉన్నమతి పోయి, కాకరకాయ ని కీకరాయ అని చదివాడట.
87) చద్ది కూడు తిన్నమ్మ మొగుడాకలి ఎరగదట.
88) చదువు రాని వాడు వింత పశువు.
89) చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ.
90) చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు.
91) చక్కనమ్మ చిక్కినా అందమే, పట్టు చీర మాసినా అందమే.
92) చల్ల కొచ్చి ముంత దాచినట్లు.
93) చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
94) చస్తుంటే సంధ్యా మంత్రమన్నాడట ఒకడు.
95) చెడపకురా, చెడేవు.
96) చెముడా (చేవుడా) అంటే మొగుడా అన్నట్టు.
97) చెప్పేవాడికి వినేవాడు లోకువ.
98) చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు.
99) చెరువు మీద అలిగి, ఎవడో ముడ్డి కడుక్కోవడం మానేశాడంట.
100) చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ.
101) చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు.
102) చెవిలో జోరీగ.
103) చెవిటి పెద్దమ్మా!, చాంతాడు ఎదే అంటే - మా అమ్మ పుట్టిల్లు కోడలా అందంట.
104) చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లు.
105) చేవిటోడు పెళ్ళికి, మూగోడి కచేరి.
106) చిల్లర దేవుళ్ళకు చేరువయితే, అసలు దేవుడికి దురమౌతావు.
107) చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి.
108) చింత చచ్చినా పులుపు చావా లేదు.
109) చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి ఏమి కాయలని అడుగుతుందట.
110) చిత్తం శివుని పైన, భక్తీ చెప్పుల పైన.
111) చిలికి చిలికి గాలివాన అయినట్లు.
112) చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు.
113) దాసుని తప్పు దండము తో సరి.
114) డబ్బివ్వని వాడు పడవ ముందు ఎక్కాడట.
115) డబ్బూ పోయే, శని పట్టే.
116) డబ్బుకు లోకం దాసోహం.
117) దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు.
118) దమ్మిడీ ముండకు ఏకాని క్షవరం .
119) దంపినమ్మ కు బొక్కిందే కూలిట.
120) దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన.
121) దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట.
122) దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
123) దేవుడు గుడి లోనే పదిలం, బయటకు వస్తే పదలం (రాయి)
124) దెయ్యాలు వేదాలు వల్లించినట్లు.
125) దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.
126) దిన దిన గండం, దీర్ఘాయిషు.
127) దొంగ చేతికి తాళాలు ఇట్చినట్లు.
128) దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి.
129) దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.
130) దూరపు కొండలు నునుపు.
131) దొరికితేనే దొంగలు, దొరక్కపోతే దొరలు.
132) దున్నపోతు దున్ని దున్ని చస్తే, మగాడు పొడిచి పొడిచి చస్తాడు (ముళ్ళు కర్ర)
133) దున్నపోతు మీద వర్షం కురిసినట్లు.
134) దురాశ దు:ఖమునకు చేటు.
135) ఏడ్చే మగవాడిని, నవ్వే ఆడదానిని నమ్మకూడదు.
136) ఈ ఊరుకు ఆ వూరు ఎంత దూరమో, ఆ వూరు నుంచి ఈ వూరు అంతే దూరం.
137) ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా, నలుపు నలుపే గానీ, తెలుపు రాదు.
138) ఎంగిలి చేతితో కాకిని తోలదన్నట్లు.
139) ఎంత చెట్టుకి అంత గాలి.
140) ఎర్ర చీర కట్టున్నదల్లా నా పెళ్ళామే అన్నాడట.
141) ఎవడి ముడ్డి కింద నీళ్ళు వస్తే వాడికి తెలుస్తుంది బాధ ఏమిటో!
142) ఏవరికి వారే యమునా తీరే.
143) ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.
144) గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్చ పోయిందట.
145) గాజుల బేరము భోజనానికి సరి.
146) గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు.
147) గాలికి పోయే దానిని గుండుకి చుట్టుకున్నట్లు.
148) గంతకు తగ్గ బొంత.
149) గతి లేనమ్మకు గంజే పానకము.
150) గోరు చుట్ట మీద రోకలి పోటు.
151) గోఛికి పొడవు, గుండరుకి కురస అన్నట్టు.
152) గోడ మీది పిల్లి.
153) గోడలకు చెవులుంటాయి.
154) గొడ్డుని చూసి గడ్డెయ్యాలి.
155) గొర్రె ఎప్పుడు కసాయినే నమ్ముతుంది.
156) గోటితో పోయేదానికి గొడ్డలి వాడినట్టు.
157) గుడ్డి కన్నా మెల్ల మేలు.
158) గుడ్డి ఎద్దు చేలో పడినట్లు.
159) గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.
160) గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే.
161) గుడినీ, గుడిలో లింగాన్ని మింగినట్లు.
162) గుడిని మింగేవాడు ఒకడైతే, గుడిలో లింగాన్ని మింగేవాడు ఒకడు.
163) గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట.
164) గుర్రం గుడ్డిదైనా, దాణాలో తక్కువ లేదు.
165) గురువుకు పంగనామాలు పెట్టినట్లు.
166) గురువును మించిన శిష్యుడు.
167) ఇల్లు అలక గానే పండగ కాదు
168) ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చుట్టకి నిప్పు కావాలన్నడట ఒకడు.
169) ఇల్లు పీకి పందిరెయ్యడం.
170) ఇంట గెలిచి రచ్చ గెలువు.
171) తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు.
172) ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
173) ఇంటి పేరు కస్తూరివారు .. ఇంటిలో గబ్బిలాల కంపు.
174) ఇంట్లో చూరు కింద నీళ్ళు తాగి, బయటకొచ్చి చల్ల తాగామని చెప్పుకుంటారు.
175) ఇంట్లో ఈగల మోత బైట పల్లకి మోత.
176) జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిదే.
177) జుట్టు వున్నఅమ్మ ఏ కొప్పు ఐనా పెడతది.
178) కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.
179) కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు.
180) కాకి ముక్కుకు దొండ పండు.
181) కాకి పిల్ల కాకికి ముద్దు.
182) కాకిలా కలకాలం బ్రతికేకన్నా, హంసలా ఆరు నెలలు బ్రతికితే చాలు.
183) కాలం కలిసి రాక పోతే, కర్రే పామై కాటు వేస్తుంది.
184) కాలికేస్తే మెడకి, మెడకేస్తె కాలికి.
185) కాలు జారితే తీసుకోగలము కాని, నోరు జారితే తీసుకోలేము.
186) కాషాయం కట్టిన వాళ్ళందరూ సన్యాసులు కారు, కాషాయం మింగిన వాళ్ళందరికీ కఫం కరగదు.
187) కడుపు చించుకుంటే కాళ్ళపై పడ్డట్లు.
188) కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును.
189) కలిమి లేములు కావడి కుండలు.
190) కలిసోచ్చే కాలం వస్తే, నడిసోచ్చే కొడుకు పుడతాడు.
191) కళ్యాణమొచ్చినా కక్కోచినా ఆగదన్నట్లు.
192) కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టుట.
193) కంచే చేను మేసినట్లు.
194) కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!
195) కందకు లేని దురద కత్తిపీట కెందుకు?
196) కందెన వేయని బండికి కావాల్సినంత సంగీతం.
197) కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.
198) కర్రిచ్చి పళ్ళు రాలకొట్టిచ్చు కోవటం
199) కీడెంచి మేలెంచమన్నారు .
200) కింద పడ్డా నాదే పై చేయి అన్నట్లు.
201) కొడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలి .
202) కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందట.
203) కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు.
204) కొండంత ఐశ్వర్యం కంటే ఆవ గింజంత అదృష్టం మేలు.
205) కొండను తొవ్వి యెలుకను పట్టినట్లు.
206) కొన్న దగ్గిర కొసరు గానీ, కోరిన దగ్గర కొసరా?
207) కుంచం కూడపెడితే మంచం మాయం చేసిందట.
208) కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి.
209) కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరచిందట.
210) కూసింత కూతురుంటే అన్నీ మంచం మీదే కూడు.
211) కూటి కోసం కోటి విద్యలు.
212) కొప్పున్నమ్మ కోటి ముడులు వేస్తుంది.
213) కోతి పుండు బ్రహ్మ రాక్షసి.
214) కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు.
215) కొత్త ఒక వింత, పాత ఒక రోత.
216) కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డదట.
217) కొత్త భిచ్చగాడు పొద్దు ఎరగడు.
218) కృషితో నాస్తి దుర్భిక్షం.
219) క్షణం తీరిక లేదు, దమ్మిడీ ఆదాయం లేదు.
220) క్షేత్ర మెరిగి విత్తనము, పాత్ర మెరిగి దానము.
221) కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.
222) కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
223) కుక్క తోక పట్టుకొని గోదారి ఈదడం.
224) కుక్షిలో అక్షరం ముక్క లేదు కానీ..
225) కుంచెడు గింజల కూలికి పోతే తూమెడు గింజలు దూడ తిని పోయిందట
226) కుండలో అన్నం కుండలోనీ ఉండాలి, పిల్లాడు మాత్రం దొడ్డుగా ఉండాలి అందిట .
227) లేని దాత కంటే ఉన్న లోభి నయం .
228) లేడి కి లేచిందే పరుగు.
229) లేనివాడి దాతృత్వము ఉన్నవాడి పిసినారితనము ఒకటే.
230) లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక.
231) లోకులు పలు కాకులు
232) మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లు.
233) మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు గడప కూడా దాటవు.
234) మగాడు తిరక్క చెడితే, ఆడది తిరిగి చెడుద్ది.
235) మంచి వాడు, మంచి వాడు అంటే ..మంచమెక్కి గంతులేశాడట .
236) మంచికి పొతే చెడు ఎదురైనట్లు.
237) మంచి మాటకు మంది అంతా మనవాళ్లే.
238) మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అయినట్లు.
239) మనిషి మర్మము, మాని చేవ, బయటకు తెలియవు.
240) మనిషి పేద అయితే మాటకు పేదా??
241) మనం ఒకటి తలిస్తే, దైవం ఒకటి తలచిందట.
242) మంత్రాలకు చింతకాయలు రాలవు.
243) మంత్రాలు తక్కువ,తుంపర్లు ఎక్కువ .
244) మెరిసేదంతా బంగారం కాదు.
245) మెత్తగా ఉంటే మొత్త బుద్ది అయ్యిందట.
246) మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె!
247) మొదలు లేదు మొగుడా అంటే, పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట.
248) మొదట భోగి, భోగాలు ఎక్కువయి రోగి, రోగాలు భరిచలేక యోగి.
249) మొదటి దానికి మోగుడు లేదు కానీ, కడదానికి కళ్యాణం అంట.
250) మొగుడ్నితన్ని మొర పెట్టుకుందిట.
251) మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు దేప్పినందుకు.
252) మొగుడు సచ్చి పెళ్ళాం ఏడుస్తుంటే లంగా గాడు వచ్చి రాయి వేశాడట.
253) మొహమాటానికి పోతే ముండకి కడుపు అయ్యిందట.
254) మొక్కై వంగనిది మ్ర్రానై వంగునా?
255) మొండి వాడు రాజు కన్నా బలవంతుడు.
256) మూల విగ్రహనికే లేక ముష్టి ఎత్తుకుంటుంటే ఉత్సవ విగ్రహాలు వచ్చి ఊరేగింపు ఎప్పుడు ఆన్నాయట.
257) మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు.
258) మొరటి వాడికి మొగలి పువ్వు ఇస్తే మడిచి ముడ్లో పెట్టుకున్నాడట.
259) మొరిగే కుక్క కరవదు.
260) మొసేవానికి తెలుసు కావడి బరువు.
261) ముడ్డి మీద తంతే మూతి పళ్ళు రాలినట్టు.
262) ముళ్ళ కంప మీద పడిన గుడ్డలా.
263) ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి.
264) ముండా కాదు, ముత్తైదువూ కాదు.
265) ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు.
266) ముందు నుయ్యి, వెనుక గొయ్యి .
267) ముందు వచ్చిన చెవుల కంటే ....వెనకొచ్చిన కొమ్ములు వాడి.
268) ముందుంది ముసళ్ల పండగ .
269) ముంజేతి కంకణముకు అద్దము ఎందుకు.
270) నారు పోసిన వాడు నీరు పోయాడా?
271) నడుమంత్రపు సిరి నరాల మీద పుండు.
272) నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది.
273) నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.
274) నాట్యం చేయవే రంగసాని అంతే నెల వంకర అందట.
275) నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగవాడిని నమ్మ కూడదు!
నవ్వినా నాప చేనే పండుతుంది.
276) నవ్వు నాలుగు విధాల చేటు.
277) నవ్వులు పోయి నువ్వులు ఆవుతాయి .
278) నీ ఎడమ చెయ్యి తియ్యి, నా పుర్ర చెయ్యి పెడతానన్నాడట ఒకడు.
279) నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు.
280) నిదానమే ప్రధానం.
281) నిజం నిలకడ మీద తెలుస్తుంది.
282) నిజం నిప్పు లాంటిది.
283) నిమ్మకు నీరు ఎత్తినట్లు.
284) నిండా మునిగిన వానికి చలి ఏమిటి ?
285) నిండు కుండ తొణకదు.
286) నిన్నటి అబధాన్ని, ఇవ్వాల్టి నిజంతో కప్పి పుచ్చలేము.
287) నిప్పు లేనిదే పొగ రాదంట.
288) నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒక్కటే గాలిపెట్టు.
289) నూరు గుర్రాలకు అధికారి, ఇంట భార్యకు ఎండు పూరీ.
290) నోరు మంచిదైతే, ఊరు మంచిది.
291) ఓడ ఎక్కే దాకా ఓడ మల్లన్న, ఓడ దిగిన తరవాత బోడి మల్లన్న అన్నట్టు.
292) ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు.
293) ఒకడికి అదృష్టం కలిసి వొచ్చి స్వర్గానికి వెళ్తే, రంభ ముట్టయి కూర్చుందిట.
294) ఒలి (కట్నం) తక్కువని గుడ్డిదాన్ని పెల్లాడాడట.
295) ఒంటి పూట తిన్నమ్మ ఓర్చుకుంటే, మూడు పూటలు తిన్నమ్మ మూర్చ పోయిందట.
296) దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే.
297) ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి.
298) ఊరక రారు మహానుభావులు.
299) ఊరంతా చుట్టాలు, ఉట్టి కట్ట తావు లేదు.
300) ఊరంతా ఒక దారి అయితే, ఉలిపి కట్టది ఒక్క దారి.
301) ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది.
302) ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడి గుండంత సుఖం లేదు.
303) పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా.
304) పచ్చ కామెర్ల వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు.
305) పక్కలో బల్లెం.
306) పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే, మంచం కొల్లలా ముగ్గురు అని రెండు వెళ్ళు చూపించాడట.
307) పాండవులు సంపాదించిన రాజ్యం కుర్వుల తద్దినానికి సరిపోయిందట.
308) పందికేం తెలుసు పన్నీటి వాసన?
309) పండిత పుత్ర, పరమ సుంట.
310) పనిలేని కోతి తోకని తీసుకు వెళ్లి మేకుల మధ్యలో దూర్చిందట, అది రాక కొట్టుకుని చివరికి చచ్చిందట.
311) పాకీ దానితో సరసం కంటే అత్తరు సాయిబుతో కలహం మేలు.
312) పాము కాళ్ళు పామున కెరుక.
313) పానకములో పుడక.
314) పాపమని పాత చీర ఇస్తే, గోడ చాటుకు వెళ్లి మూర వేసిందట.
315) పాపి చిరాయువు.
316) పనిలేని మంగలోడు పిల్లి తల గొరిగాడంట.
317) పప్పులో కాలెసినట్టు.
318) పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు.
319) పరుల సొమ్ము పాము వంటిది.
320) పట్టిందల్లా బంగారమైనట్లు.
321) పట్టిపట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్లి చెరిపి వేసుకున్నాడట.
322) పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్లినట్టు.
323) పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు.
324) పేనుకు పెత్తనమిస్తే తలంతా గోరికిందట.
325) పెరగుట విరుగుట కొరకే.
326) పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.
327) పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము.
328) పిచ్చోడి చేతిలో రాయి.
329) పిలవని పేరంటానికి వెళ్ళినట్లు.
330) పిలిచి పిల్లని ఇస్తానంటే, కులం తక్కువ అన్నాడట.
331) పొరుగింటి పుల్ల కూర రుచి ఎక్కువ.
332) పొట్ట కొస్తే అక్షరం ముక్క లేదు.
333) పొట్టి వానికి పుట్టెడు బుద్ధులు.
334) పోటుగాడు పందిరి వేస్తే పిచికలు వచ్చి కూలదొశాయంట.
335) పౌరుషం పుల్లింగం, సహనం స్త్రీ లింగం.
336) పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.
337) పుండు మీద కారం చల్లినట్లు.
338) పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు.
339) పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి.
340) పువ్వు పుట్టగానే పరిమలించదు.