శతకములు


సుమతీ శతకము

అక్కరకురాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు
మొహరమున తానెక్కిన భారని గుర్రము
గ్రక్కున విడువంగవలయు గదరా.. సుమతీ!!
 

తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తధ్యము.. సుమతీ!!
 

తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తల తోక యనకనుండును
ఖలునకు నిలువెల్లా విషముగదరా.. సుమతీ!!
 

కనకపు సింహాసమున
శునకము గూర్చుండబెట్టి సుభాలగ్నమునన్
వోనరగా బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా.. సుమతీ!!
 

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటే
వడిగల యెద్దుల గట్టుక
మది దున్నక బ్రతుకవచ్చు మహిలో సుమతీ!!
 

ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దేప్పలుగా జెరువు నిండిన
గప్పలు పదివేలు చేరుగదరా.. సుమతీ!!
 

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయు వివరింపంగా
నపకారికి నుపకారము                
నెపమెన్నక సేయువాడు నేర్పరి.. సుమతీ!!
 

సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు లధిక భాదల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుత హెచ్చు కొరకే తధ్యము సుమతీ!!
 

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడుధగాన్
హేమంభు గూడ బెట్టిన
భువీసుల పాలు జేరు భువిలో సుమతీ!!
 

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపతగున్
గని కాళ్ళ నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!!
 

బలవంతుడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుట మేల?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ!!
 

పిలువని పనులకు బోవుట,
గలయని సతి రతియు, రాజు గానని కొలువున్
బిలువని పేరంటంబును,
వలవని చెలిమియును జేయ వలదురా..  సుమతీ!!
 

నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతులతో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!!
 

కూరిమి గల దినములలో
నేరములెన్నడును గలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!!