పొడుపు కథలు


పొడుపు కథలు (విడుపు కథలు)


1వ బాగం (part 1)
౧. అంగట్లో పెట్టి అమ్మేది కాదు, తక్కెట్లో పెట్టి తూచేది కాదు, అది లేకుంటే పండుగే జరుగదు.
౨. అంగుళం ఆకు, అడుగున్నర కాయ.
౩. అంతులేని ఆకు అతనిలో ఉంది.
౪. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకూ కోటి పువ్వులు, అన్ని పువ్వుల్లో రెండే కాయలు.
౫. అందమైన చెరువులో, ముద్దు వచ్చే పిట్ట మూతికి బంగారం,  తోకతో నీరు తాగును.
౬. అందరాని వస్త్రం మీద అన్నీ వడగళ్ళు.
౭. అందరికీ ఒకే కొడుకు, ఒకే కూతురు.
౮. అందరికీ ముఖం చుఉపుతాను, కానీ వీపు గోకు వాళ్ళతో విరోధం.
౯. అంబకు చెంబు, చెంబులో చారెడు నీళ్ళు.
౧౦. అంబులో పుట్టింది, చెంబులో పెరిగింది, అరచేతికోచ్చింది, అంతరించి పోయింది.
౧౧. అంభాల మీద కుంబాలు, 
కుంబాల మీద కుడిత్తోట్టి,
కుదిత్తోట్టి మీద గుండ్రాయి, 
గుండ్రాయి మీద కోరింత, 
కోరింత మీద ఆరిక ఆవురూ,
ఆరిక ఆవురు గడ్డిలో ఆవులు వేయు.
౧౨. అక్క ఇంట్లో దీపం పెడితే చెల్లెలి ఇంట్లో పొగ వస్తుంది.
౧౩. అక్కడక్కడ బండి, అంతరాల బండి, మద్దూరు సంతలో  మాయమైన బండి.
౧౪. అక్కడకు పచ్చ పచ్చని చిలుకలోచ్చాయి, కొంటారు, తింటారు, అంగడిలో అమ్ముతారు.
౧౫. అక్క ఇంటికి చెల్లి పోతుంది కానీ, చెల్లి ఇంటికి అక్క రాదు.
౧౬. అక్కా చెల్లెళ్ళ అనుబంధం, ఇరుగూ పొరుగూ సంబంధం, 
దగ్గర దగ్గర ఉన్నారు, దరికి చేరలేకున్నారు.
౧౭. అక్కా చెల్లెళ్ళు ఏడుస్తారు, అయితే దగ్గర చేరలేరు.
౧౮. అటూ ఇటూ ముళ్ళకంచెలు, మధ్యన రోడ్డు.
౧౯. అగ్గి అగ్గీఛాయ, అమ్మ కుంకుమ చాయ, 
బొగ్గు చాయ-పోలి చాయ, కందిపప్పు చాయ,
కాలనేమి చాయ, కడసారి తాతయ్య కణతి చాయ.
౨౦. ఆడకర్రావు ఈడకర్రావు, నీళ్ళజూచి నిలుచుకర్రావు.
౨౧. అడవిలో అక్కమ్మ ఆశు పోసింది.
౨౨. అడవి మ్రాను నరికేసి, సముద్రపొడ్డున యాతం వేసి, 
నెల్లూరుకు చీటీ వ్రాసి, చార చరా నడుస్తాడు. ధర్మరాజు.
౨౩. అగ్గిమీద గుగ్గిలం అటూ ఇటూ అరక్షణం.
౨౪. అడవిలో చెట్టుకి ఒక అక్షరం, ఒళ్లో ఇల్లుకు అదే అక్షరం, ఒక వారనికదే అక్షరం.
౨౫. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, 
పాడు పాములు వచ్చి, పైన పడ్డాయి.
రాజు ఇంటికొచ్చింది, రాజుపై కెక్కింది, 
చెంబులో నీళ్లన్నీ, తెగ తాగి పోయింది,
చెబితే నీ నోరు, గుప్పుమంటుంది. 
తప్పితే నీ నోరు, చాప్పమంటుంది.

పై ప్రశ్నలకు సమాధానాల కోసం,
మీ సమాధానాలుమాకు ఈ-మెయిల్ పంపించండి post@TeluguBidda.in  సబ్జెక్టు లో “podupu kathalu, part-1” అని టైపు చేయండి.

No comments:

Post a Comment