తెలుగువాడు: శాతవాహనుల వంశాన పుట్టిన వాడు కాకతీయుల పోతుగడ్డ మేట్టినవాడు పల్లెలోనే కాదు డిల్లీలో సైతమ్ము పెద్దగద్దేలనేలి పెరుకేక్కినవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇం కెవడయ్య తెలుగువాడు.
పంచె కట్టుటలో మొనగాడుకండువాలేనిధే గడపదాటని వాడుపంచబక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసువాడుఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు.
నేల నల్దేసల డేరాలు నాటినవాడుఅన్ని మూసలలోన అట్టే ఒదిగినవాడు"ఎ దేసమేగిన ఎందుకాలిడినా"ఆవకాయ వియోగామసలె సైపని వాడుఎవడయ్య ఎవడు వాడు ఇం కెవడయ్య తెలుగువాడు.
మంచి మనసెదురైన మాలలిచ్చేవాడుభాయీ భాయీ అన్న చేయి కలిపేవాడు తిక్కరేగిందంటే డొక్కా చీల్చేవాడుచిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడుఎవడయ్య ఎవడు వాడు ఇం కెవడయ్య తెలుగువాడు.
రచయిత: డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( జ్ఞానపీట్ అవార్డ్ గ్రహీత)
------------------------------------------------------------------------------------------------------------
రాముడు ఏలిన రాజ్యమ నాది
రాముడు ఏలిన రాజ్యమ నాది రక్తమే పారుతుందిమానవత్వమే మరచి నేడు అమ్మనే అవమనిస్తున్నామాఇది నిజం జనం సాక్షిగా నా గళం అరుస్తుందివేదనతో మనసు రగులుతుందిఒక్క నిమిషం ఆలోచించు...నేస్తామా..మనిషిగా పుట్టిన మానవత్వమా!
వీర పురుషుల ఈ భారత జాతిని తలవంచనీయకు నీచ రాజకీయాలకై చేతులు చాచకుఆవేశం కట్టలు తెంచి అవనికి సమాదులు కట్టకుఅమ్మ భారతిని నరికే ఈ సిగ్గులేని మనుషుల వెనుకఒక్క నిమిషం ఆలోచించు...నేస్తామా..మనిషిగా పుట్టిన మానవత్వమా!
-- పంపిన వారు
రాముడు ఏలిన రాజ్యమ నాది రక్తమే పారుతుంది
మానవత్వమే మరచి నేడు అమ్మనే అవమనిస్తున్నామా
ఇది నిజం జనం సాక్షిగా నా గళం అరుస్తుంది
వేదనతో మనసు రగులుతుంది
ఒక్క నిమిషం ఆలోచించు...నేస్తామా..మనిషిగా పుట్టిన మానవత్వమా!
వీర పురుషుల ఈ భారత జాతిని తలవంచనీయకు
నీచ రాజకీయాలకై చేతులు చాచకు
ఆవేశం కట్టలు తెంచి అవనికి సమాదులు కట్టకు
అమ్మ భారతిని నరికే ఈ సిగ్గులేని మనుషుల వెనుక
ఒక్క నిమిషం ఆలోచించు...నేస్తామా..మనిషిగా పుట్టిన మానవత్వమా!
-- పంపిన వారు
"Srinath Rayala" <srinath.rayala@gmail.com>
wow dude very nice keep the good work
ReplyDelete