మహనీయులు : తెలుగు సూర్యుడు సి.పి.బ్రౌన్
"చార్లెస్ ఫిలిప్ బ్రౌన్", తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు.
"చార్లెస్ ఫిలిప్ బ్రౌన్", తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు.
- 1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణబూతమైనవాడు బ్రౌన్.
- దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్.
- చిత్తు కాగితాలు గా ఉపయోగిస్తున్నవేమన ప్రతులను చూసి బాధపడి, ఆ గ్రంధాన్ని పునర్ముద్రించాడు.
- బ్రౌన్ వ్యాయ ప్రయాసలకోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంధాలు అసంక్యాఖం. మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, దశావతార చరిత్ర మొదలైన కావ్యాలు, ప్రబంధాలు బ్రౌన్ కృషి వల్లనే తెలుగు వారికి అందుబాటులోకి వచ్చాయి.
- కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు.
- ఈ నాటికీ ప్రామాణికంగా ఉన్న బ్రౌన్ "ఇంగ్లిష్ - తెలుగు", "తెలుగు-ఇంగ్లిష్" dictionary ని ఆయన 1852, 1853 లో సమకూర్చాడు.